సంబంధిత వార్తలు
- కరోనా వైరస్ విజృంభణ.. కేకేఆర్‌కు షాక్.. అక్షర్ పటేల్‌కు పాజిటివ్
- కోవిడ్ వ్యాక్సిన్‌కు తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా?
- సెలెబ్రిటీలను వదలని కరోనా.. కనిమొళికి కోవిడ్ పాజిటివ్
- కరోనావైరస్: లక్షకు చేరువలో రోజువారి కేసులు, ఇలాగైతే మళ్లీ లాక్డౌన్ తప్పదేమో!- Newsreel
- నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు.. వామ్మో వడగాలులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. ఏపీలో 1398, తెలంగాణలో 1078 కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1398 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9లక్షల 5వేల 946కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది మృత్యువాత పడడంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7 వేల 234 కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 89వేల 295గా ఉండగా ప్రస్తుతం 9వేల 417 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, క్వారంటైన్ సెంటర్‌ను సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.
ఇక తెలంగాణలో తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. ఇందులో 3,02,207 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 6,900 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
తర్వాతి కథనం
