సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:23 IST)

సెలెబ్రిటీలను వదలని కరోనా.. కనిమొళికి కోవిడ్ పాజిటివ్

సెలెబ్రిటీలు రోజుకు ఒకరు చొప్పున కరోనా బారిన పడుతున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఒక్క రోజులోనే సుమారు 90 వేల మంది కేసులు నమోదయ్యాయి. ఈ దశలో కూడా సచిన్‌ వంటి ప్రముఖలు కరోనా బారిన పడ్డారు. తాజాగా డిఎంకె తూత్తుకుడి ఎంపి కనిమొళికి కోవిడ్‌ సోకింది. శనివారం వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. కరోనా సోకడంతో ప్రచారాలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారని సమాచారం. తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 3,290 కొత్త కేసులు నమోదయ్యాయి. గత అక్టోబర్‌తో పోలిస్తే అత్యధిక కేసులు రికార్డయ్యాయి.