శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (22:31 IST)

శశికళకు కోవిడ్.. పాజిటివ్‌గా నిర్ధారణ.. ఐసీయూలో చికిత్స

అక్రమాస్తుల కేసులో పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలికి కరోనా సోకింది. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్లు ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూరపాండియన్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో అస్వస్థతకు గురైన శశికళను జైలు అధికారులు బుధవారం స్థానిక లేడీ క్యూర్‌జోన్‌ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆమెకు గురువారం కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. తొలుత యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గానే తేలినప్పటికీ.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసీయూలో వుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
 
ఆమె బంధువులు, వైద్యులు, శివకుమార్, వెంకటేష్ ఇద్దరూ ఆమెను సందర్శించడానికి అనుమతించారు. ఆమె మేనల్లుడు టిటివి ధినకరన్, ఎఎమ్ఎంకె నాయకుడు కూడా బెంగళూరులో ఉన్నారు.
 
గురువారం సాయంత్రం ఐదు గంటలకు విక్టోరియా హాస్పిటల్ విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, శశికళ సీటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల్లో కోవిడ్ కేంద్రీకృతమైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె డయాబెటిక్, రక్తపోటు కారణంగా యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఇన్సులిన్, స్టెరాయిడ్స్ మరియు ఇతర సహాయక చర్యలతో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) కోసం చికిత్స పొందుతున్నట్లు బులెటిన్ పేర్కొంది.