1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. The mother forced her married daughter to kill her husband

భర్తను వదిలేసి మేనమామను పెండ్లి చేసుకోవాలని తల్లి ఒత్తిడి

mother
హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సాయినాథపురానికి చెందిన  ఆమె కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని అందరూ భావించారు. అయితే నెరెడ్మెట్ పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపగా ఒక సూసైడ్ నోట్ లభించడంతో విషయం బయటకు వచ్చింది.
 
మృతిరాలి తల్లి రాములమ్మ అతని మేనమామ పుల్లారావు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మృతిరాలి భర్తను చంపేసి మేనమామ అయినటువంటి పుల్లారావును వివాహం చేసుకోవాలని నిందితులు ఇద్దరు కలిసి మృతురాలిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
 
భర్తను చంపడానికి పొలాలకు వాడే పురుగులమందును కూడా అందించారు. అమాయకుడైన భర్తను చంపడం ఇష్టం లేక వీరి ఒత్తిడి తట్టుకోలేక చివరకు అదే పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు తన అమ్మ, మేనమామే కారణమంటూ సూసైడ్ నోట్ వ్రాసి మరీ చనిపోయింది. పోలీసులు నిందితులను ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
అక్టోబర్‌ 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు