గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (11:17 IST)

పెళ్లైన 20 రోజులకే భర్తపై రోకలి బండతో దాడి.. కుప్పకూలిపోయాడు..

భర్త వేధింపులు తాళలేక పెళ్లైన 20 రోజులకే ఓ నూతన వధువు భర్తనే కడతేర్చింది. పెళ్లైన 20 రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. హైదరబాద్ టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జిర్రా ముజాహీద్‌నగర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఫర్నీచర్‌ దుకాణంలో పనిచేసే మహ్మద్‌ అస్లాం(25) ముజాహిద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి సమ్రీన్ (22)తో 20 రోజుల క్రితం వివాహమైంది. 
 
శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో సమ్రీన్‌ రోకలిబండతో అస్లాం తలపై బలంగా కొట్టింది. స్థానికులతో కలిసి అస్లాం తండ్రి బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అస్లాం మృతి చెందాడు. 
 
కాగా.. పెళ్లినాటి నుంచే అస్లాం రోజూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగొద్దని సమ్రీన్‌ ఎంత చెప్పినా వినిపించుకోకుండా వేధింపులకు గురిచేసేవాడు. గురువారం రాత్రి అస్లాం మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఈ విషయమై శుక్రవారం కూడా గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో సమ్రీన్‌ రోకలి బండతో అస్లాంపై దాడిచేయగా కుప్పకూలాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.