1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. The workload is the cause of the MMTS accident?

ఎంఎంటీఎస్ ప్రమాదానికి పనిఒత్తిడే కారణమా?

workload
రైలు ప్రమాదానికి కారణమని భావిస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు లోకోపైలట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ అనుభవజ్ఞుడే. సోమవారం మరి ఏమయ్యిందో కాచిగూడలో సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు దూసుకెళ్లాడ’ని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.

చంద్రశేఖర్‌ 2011లో సహాయ లోకోపైలట్‌గా చేరాడు. అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి లోకోపైలట్‌గా మారాడు. మూడు నెలల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను మొత్తం 48 ట్రిప్పులు తిప్పాడు. లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంపై పూర్తి పట్టు ఉంది. సిగ్నల్‌ను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమైంది.

పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం తదితర కోణాల్లో ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ కేర్‌ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో వైద్యం పొందుతున్నాడు. 16 ఏళ్లుగా ఎంఎంటీఎస్‌కు సంబంధించి పెద్దగా ప్రమాదాలు జరగకపోవడంతో వీటిపై అధికారులు దృష్టి సారించలేకపోయారని చెబుతున్నారు.

లోకోపైలట్ల నుంచి ప్రతీ విషయంలో అధికారులు చూసీచూడనట్లు వదిలేయడమే ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి: మంత్రి ముత్తంశెట్టి