1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TRS Dharnas in Telangana State Wide for Paddy Procuring

ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస ధర్నాలు

Telangana
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార తెరాస పార్టీ ధర్నాలకు దిగింది. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలతో కలిసి రైతులు రైతు ధర్నాలు దిగారు. 
 
ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ, జిల్లాలో కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.
 
ఈ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు బైడెన్ శుభవార్త