1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Two Persons dies aftr Electric Shock in Bhadradri Kothagudem Dist

వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

Bhadradri Kothagudem Dist
తెలంగాణా రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విషాదంనెల‌కొంది. అడ‌వి జంతువుల కోసం వేట‌గాళ్లు అమ‌ర్చిన విద్యుత్ తీగ‌లు త‌గిలి ఇద్ద‌రు గిరిజ‌న వ్య‌క్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ముల‌క‌ల‌ప‌ల్లి మండ‌లం మాదారం అట‌వీప్రాంతంలో మంగ‌ళ‌వారం ఉద‌యం చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిరిజ‌నులు కూలీ ప‌నుల‌కు వెళ్తుండ‌గా విద్యుత్ తీగ‌ల‌పై ఓ ఇద్ద‌రు కాలు మోపారు. విద్యుత్ షాక్‌కు గురై ఆ ఇద్ద‌రు మ‌ర‌ణించారు. 
 
మృతుల‌ను మొగ‌రాల‌కుప్ప‌కు చెందిన పాయం జాన్‌బాబు (24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 
తర్వాతి కథనం
ద‌ళిత బాలిక‌పై హ‌త్యాచారం చేసిన వాడిని ఉరితీయాలి