బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (20:02 IST)

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాబు కూడా ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జాతీయ రహదారి అత్వెలి గ్రామ రేకుల బావివద్ద తూప్రాన్ నుండి నగరానికి వస్తున్న టాటా ఏస్ AP 28 TV 5762 వాహనాన్ని బైక్ TS 36 H 9497 ను రాంగ్ రూట్‌లో కొంపల్లి నుండి వస్తున్న కారు AP 11Ac 4902 ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందారు. 
 
మృతుల్లో ఒక మహిళ ఒక బాబు కూడ ఉన్నారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.