1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mega Hero Sai Dharam Tej met Accident

కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. హీరో సాయిధరమ్‌కు తీవ్ర గాయాలు.. అపర్మారకస్థితి

Sai Dharam Tej
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు. 
 
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా ఈ కేబుల్ బ్రిడ్జీని ఐకియా రోడ్డులో నిర్మించారు. ఈ రోడ్డులో స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వస్తుండటతో ఒక్కసారిగా బైకు అదుపుతప్పడంతో కింద‌ప‌డిపోయాడు.

ఈ ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో ఉన్నట్టు సమాచారం. మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
తర్వాతి కథనం
'భవదీయుడు భగత్‌ సింగ్‌'గా పవన్ కళ్యాణ్