మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:45 IST)

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా జిల్లాలోని శంషాబాద్ మండల పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. 
 
తుక్కు గుడా వైపు నుండి శంషాబాద్ వైపు వస్తున్న ట్రక్కు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్జున్ అనే డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.