1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (17:22 IST)

'భవదీయుడు భగత్‌ సింగ్‌'గా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే మరో కొత్త చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
వినాయకచవితి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్‍తో కూడిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతుంటే డీవోపీగా బోస్ పని చేస్తున్నారు.
 
కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.