సంబంధిత వార్తలు
- PSPK28 టైటిల్ ఇదే: భవదీయుడు భగత్ సింగ్
- టక్ జగదీష్ నాకు చాలా ప్రత్యేకం - నానిలో నచ్చిన విషయం అదే- రీతూ వర్మ
- ఇళయరాజా సారధ్యంలో శర్మన్ జోషి, శ్రియా శరన్ మ్యూజిక్ స్కూల్
- షరియా చట్టాల అమలులో వెనక్కి తగ్గేదే లేదు : తేల్చి చెప్పిన తాలిబన్లు
- అద్దంలో మొహం చూసుకో పో.. మొహం గురించి మాట్లాడితే..? (video)
33 మంది ప్రముఖులు ఒకేసారి విడుదలచేసిన అరుణ్ విజయ్ - ఏనుగు ఫస్ట్ లుక్
Arun Vijay look
మాస్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్‌పై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 33 మంది సెలెబ్రిటీల ఒకేసారి ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం విశేషం. ఈ పోస్టర్‌లో వినాయకుడి విగ్రహాన్ని పట్టుకుని అరున్ విజయ్ డిఫరెంట్ లుక్కులో కనిపిస్తున్నారు. తెల్లటి దుస్తుల్లో హీరో మెరిసిపోతోన్నారు. ఆ లుక్కు చూస్తుంటే కట్టలు తెంచుకునే ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఆ మీసం కట్టు పౌరుషానికి ప్రతీకలా కనిపిస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ఈ పండుగకు సరైన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
ప్రస్తుతం ఏనుగు షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, యోగిబాబు, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, రాజేశ్, కేజీయఫ్ రామచంద్రరాజు, అమ్ము అభిరామి, బోస్ వెంకట్, సంజీవ్, తలైవాసల్ విజయ్, ఇమాన్ అన్నాచి, ఆడుకలమ్ జయాబాలన్, గంగై అమరణ్, ఐశ్వర్య రమా తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాంకేతికంగానూ బలమైన టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఆంథోని ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు:
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, యోగిబాబు, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, రాజేశ్, కేజీయఫ్ రామచంద్రరాజు, అమ్ము అభిరామి, బోస్ వెంకట్, సంజీవ్, తలైవాసల్ విజయ్, ఇమాన్ అన్నాచి, ఆడుకలమ్ జయాబాలన్, గంగై అమరణ్, ఐశ్వర్య రమా తదితరులు
తర్వాతి కథనం
