1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Unique Identification Authority of India (UIDAI) Jobs

ఆధార్ సంస్థల్లో ఉద్యోగాలు.. మొత్తం 15 పోస్టులు

Unique Identification Authority of India (UIDAI)
యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ లాంటి పోస్టుల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్‌ని విడుదల చెయ్యడం జరిగింది. హైదరాబాద్‌, చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో రీజనల్ ఆఫీసులలో ఉద్యోగాలు ఉన్నాయి. 
 
దీనిలో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్ ఆఫీసులో కేవలం 2 ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. 
 
శాలరీ విషయంలో పే మ్యాట్రిక్స్ లెవెల్ 8 వర్తిస్తుంది. వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
About Writer
సెల్వి