1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Vanaparthi student attempt suicide

రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని..

Vanaparthi
వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్‌ విద్యార్థిని రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా నల్లగుంటకు చెందిన శ్రీవర్ష.. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతుంది. 
 
కాలేజీకి వెళ్లేందుకు బుధవారం గద్వాల నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బలూచిస్థాన్‌లో రక్తపాతం... 100 మంది పాక్ సైనికుల హతం