సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: గురువారం, 27 జనవరి 2022 (21:38 IST)

పేద విద్యార్థినిని చదివిస్తానని చెప్పి చెట్ల పొదలమాటుకి తీసుకెళ్లి అఘాయిత్యం...

చదువులు నేర్పించే గురువు అతను. తల్లి, తండ్రి తరువాత గురువునే చెబుతుంటారు. అలాంటి వ్యక్తి కామాంధుడిగా మారాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ గురువు మీద ఎవరూ తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ ఒక విద్యార్థిని పేదరికాన్ని మాత్రం ఆసరాగా చేసుకుని ఉపాధ్యాయుడే చదివించాడు. తాను బాగా చదువుతాననే ఉద్దేశంతోనే ఉపాధ్యాయుడు చదివిస్తాడనుకునింది ఆ యువతి. కానీ ఆ తరువాతే అతని నిజస్వరూపం బయటపడింది.

 
పుదుచ్చేరి కలితీర్థకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో సెంథిల్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2006లో ఇతనికి వివాహం జరిగింది. అయితే 2018 వరకు పిల్లలు పుట్టలేదు. ఆ తరువాత ఒక పాప పుట్టింది. సాఫీగా కుటుంబం సాగిపోతుంది. అయితే సెంథిల్ కుమార్ విద్యార్థులతో అసభ్యంగానే ప్రవర్తించేవాడు. 

 
రాణి అనే విద్యార్థిని బాగా చదువుతోంది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో వారి కుటుంబం ఉండేది. దీన్నే ఆసరాగా చేసుకున్న సెంథిల్ కుమార్ విద్యార్థినికి బాగా దగ్గరయ్యాడు. విద్యార్థిని రాణి కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం మొదలుపెట్టాడు. 

 
సెంథిల్ కుమార్‌ను దేవుడిగా భావించారు రాణి కుటుంబ సభ్యులు. ఇలా ఆ బాలికతోను, వారి కుటుంబ సభ్యులకు బాగా దగ్గరయ్యాడు. బాలికతో ఎక్కువగా చనువుగా ఉండేవాడు సెంథిల్ కుమార్. అయితే గత వారంరోజుల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉండేది. అందుకు కారణం విద్యార్థునులే. తమతో సెంథిల్ కుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థునులు తల్లిదండ్రులకు చెప్పకుండా నేరుగా సెంథిల్ కుమార్ భార్యకే వచ్చి చెప్పారు. దీంతో తన ఇష్టమొచ్చినట్లు ఉంటానంటూ భార్యతో తరచూ గొడవపడేవాడు సెంథిల్.

 
అయితే నిన్న పాఠశాల ముగిసిన తరువాత రాణిని స్కూటర్ పైన దింపుతానని ఎక్కించుకుని వెళ్ళాడు సెంథిల్. దారిలో చెట్ల మధ్యలో నిలిపి కాసేపు ఇక్కడ కూర్చుని వెళదామన్నాడు. ఆ తరువాత ఆమె ప్రైవేటు భాగాలపై చేతులు పెట్టడం మొదలెట్టాడు. దీంతో ఆ విద్యార్థినికి అసలు విషయం అర్థమైంది. గట్టిగా కేకలు పెట్టింది. చుట్టుప్రక్కల గ్రామస్తులు సెంథిల్ కుమార్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్థి చేశారు. పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపితే పాఠశాలలో చాలామంది విద్యార్థునులతో ఇదేవిధంగా సెంథిల్ ప్రవర్తించేవాడని అసలు విషయం బయటపడింది.