గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (09:19 IST)

బాలికలపై అకృత్యాలు.. ప్రైవేట్ స్కూల్ టీచర్ అరెస్ట్

బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా తరగతిలో బాలికల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల్‌కు చెందిన రేగొండ వెంకట సాయి అనే 31 ఏళ్ల ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యార్థినుల ఫోన్‌ నెంబర్లను సేకరించి ప్రతి రోజూ వాళ్లతో చాటింగ్‌ చేసేవాడు. అతని అసభ్య ప్రవర్తన స్కూలు మేనేజ్‌మెంట్ దృష్టికి రావటంతో అతన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించారు.
 
దీంతో వెంకట సాయి తన ఫోన్‌లో సాంకేతికత సాయంతో ఓ గుర్తు తెలియని వ్యక్తిగా మైనర్‌ బాలికకు మెసేజ్‌లు చేయడం మొదలు ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నానని చెప్పడంతో అప్పటి నుంచి సదరు బాలిక సమాధానం ఇవ్వటం మానేసింది. 
 
దీంతో కక్ష గట్టిన వెంకటసాయి సదరు బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫొటోలు, వీడియోలను పంపించాడు. దీంతో వెంటనే బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం వెంకటసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.