శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (14:35 IST)

నేను సూపర్ హీరో కాదు.. సోనూసూదే అర్హుడు.. కేటీఆర్ ట్వీట్ వైరల్

Sonu Sood_KTR
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా కాలంలో వందల కొద్దీ రిక్వెస్టులు వస్తున్నాయి. కరోనా కాలంలో ఆపదలో వున్నవాళ్లు సాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. వాటిలో తనకు వీలైనంత వరకు సాయం చేస్తున్నాడాయన. రీసెంట్​గా సాయం అందుకున్న ఓ వ్యక్తి కేటీఆర్​ను ‘సూపర్​హీరో’గా పొగడగా.. అందుకు సోనూసూద్ అర్హుడంటూ కేటీఆర్​ బదులిచ్చారు.
 
తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నందకిషోర్ అనే వ్యక్తి ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టాడు. ​ఆక్సిజన్ కాన్​సన్ట్రే​టర్​ను అడగ్గానే.. అందేలా చూసినందుకు థ్యాంక్స్​తో సరిపెట్టలేనని ఆ వ్యక్తి పోస్టు చేశాడు. అడిగిన వెంటనే సాయం అందించనందుకు కృతజ్ఞతలని, తెలంగాణ ప్రజలకు మీతరపున అందుతున్న సాయం మరువలేనిదని, చివరగా మీరు సూపర్​ హీరో అని చెప్పాలనుకుంటున్నానని నందకిషోర్​ ట్వీట్ చేశాడు. 
 
అందుకు కేటీఆర్ ప్రతిగా స్పందించారు. ప్రజల ప్రతినిధిగా తోచిన సాయం చేస్తున్నా బ్రదర్ అంటూ తెలిపారు. మీరు సోనూసూద్​ను(ట్యాగ్ చేసి మరీ) సూపర్​ హీరో అనడం కరెక్ట్​. ఆపదలో ఉన్నవాళ్లు మీరు సాయం అందించండని ఆ వ్యక్తికి సూచించాడు. కేటీఆర్​ రిప్లైకి సోనూసూద్ కూడా స్పందించారు. 
 
‘థ్యాంక్​ యూ సో మచ్​ సర్. కానీ, తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్​ హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నాకు మరో ఇంటిలాంటిది. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్​ రీ ట్వీట్​ చేశారు.