సంబంధిత వార్తలు
- టిటిడి అగర బత్తులు రెడీ... సెప్టెంబరులో భక్తులకు సరఫరా
- హైదరాబాదీ బిర్యానీపై తాలిబన్ల ప్రభావం.. కారణం అదేనా?
- అరెస్టుకు అనుమతిస్తే హక్కుల్ని హరిస్తారా?: సుప్రీంకోర్టు
- రాజీవ్ గాంధీ కృషి వల్లనే 18 ఏళ్లకు ఓటు హక్కు : రేవంత్ రెడ్డి
- చాలాసేపు తిరుమల శ్రీవారి గుడిలో కిషన్ రెడ్డి? సామాన్య భక్తుల ఆగ్రహం..?
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు - బుధవారం విచారణ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు వ్యవహారంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సుప్రీంకోర్టులో సండ్ర పిటిషన్ వేశారు. అలాగే, ఈ కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు బుధవారం విచారణ జరుపుతామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం తెలిపింది.
మరోవైపు, ఇదే విషయమై సండ్ర వేసిన పిటిషన్‌ను గత ఏడాది తెలంగాణ హైకోర్టు కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు.