రాజీవ్ గాంధీ కృషి వల్లనే 18 ఏళ్లకు ఓటు హక్కు : రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని, భారత్ రత్న రాజీవ్ గాంధి జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహించింది. గాంధీ భవన్ లో, సోమజిగూడా, ప్రకాశం హాల్ లో జరిగాయి.
సోమజి గుడలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కృషి ఫలితంగా యువత రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చిందని 18 ఏళ్లకు యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ దని రేవంత్ రెడ్డి అన్నారు.
21 ఏళ్లకు ఐ.ఏ.ఎస్ లు, ఐపీఎస్ లు అయ్యి యువత ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పుడు 21 ఏళ్లకే అసెంబ్లీ లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఈ విషయాన్ని సోనియా గాంధీ గారితో చర్చిస్తామని అన్నారు.
నేడు ప్రపంచంలో ప్రతి పది మంది లో నలుగురు ఐ.టి ఉద్యోగులు ఉండి ప్రపంచంలో అన్ని దేశాలకు ఐ.టి ఉద్యోగులను ఎగుమతి చేసే దేశంగా ఎదిగమంటే అది రాజీవ్ గాంధీ ఘనత అన్నారు.
దేశాన్ని పటిష్టమైన, సమఖ్యమైన దేశంగా నిర్మించడంలో రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని, దేశ సమగ్రతను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కృషి చేశారని దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు..
సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ వి. హనుమంతరావు, బోసురాజు, గీతా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే రాత్రి ప్రకాశం హాల్లో రాజీవ్ గాంధీ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాడీ బిల్డర్లు, వివిధ విభాగాల లో గెలిచిన వారికి రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలరాజు, అంజన్ కుమార్ యాదవ్, కైలాష్ కుమార్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.