సంబంధిత వార్తలు
- బట్టతలకు విగ్గు పెట్టి పెళ్లి చేసుకున్నాడు, భర్త అత్తమామలపై కేసు పెట్టిన భార్య
- అర్థరాత్రి భార్యతో రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త ఏం చేశాడంటే?
- ప్రియుడి మోజు.. భర్తను సెల్‌ఫోన్ ఛార్జర్ వైర్‌తో హత్య చేసి.. ఫ్యానుకు ఉరేసింది..
- విశాఖలో ఘోరం.. భార్యపై అనుమానం.. యాసిడ్ పోసి దాడి
- బాప్ రే బాప్... జడ్డూ సిక్సర్లపై సాక్షి ధోని కామెంట్స్...
భార్య మరణాన్ని తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య... ఎక్కడ..?
భార్యాభర్తల అనుబంధానికి ఈ ఘటనే నిదర్శనం. భార్య మరణాన్ని తట్టుకోలేక.. భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది.
గ్రామానికి చెందిన లోమిట రాజు భార్య రమ్య క్యాన్సర్‌తో నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. భార్య మృతిని తట్టుకోలేని రాజు తర్వాత మద్యానికి బానిసయ్యాడు. రాజు-రమ్య దంపతులకు సిరి(12), వైష్ణవి(9) కూతుర్లు ఉన్నారు.
ఆదివారం మధ్యాహ్నం పత్తి చేను వద్దకు వెళ్తున్నానని కూతుళ్లకు చెప్పాడు. వారు కూడా తండ్రి వెనకాలే వెళ్లారు. రాజు భార్య సమాధి వద్దకు చేరుకుని రోదిస్తూ పురుగుల మందు తాగాడు.
గమనించిన కూతుళ్లు పరుగున వచ్చి కుటుంబసభ్యులకు తెలిపారు. బంధువులు వెళ్లేసరికే రాజు స్పృహ కోల్పోయాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారు.
