శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 2 నవంబరు 2020 (11:04 IST)

బట్టతలకు విగ్గు పెట్టి పెళ్లి చేసుకున్నాడు, భర్త అత్తమామలపై కేసు పెట్టిన భార్య

సామాన్యంగా వెయ్యి అబద్దాలు చెప్పి ఓ పెళ్లి జరిపించాలంటారు పెద్దలు. కానీ ఒకే ఒక విగ్గు పెట్టి తన బట్టతలను  కవర్ చేసి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు అత్త మామలపై కేసు పెట్టింది. ఈ కేసులో అత్తమామలకు ముందస్తు బెయిలు లభించగా భర్తకు మాత్రం చుక్కలు చూపించారు.
 
ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని మీరా రోడ్డుకు చెందిని 29 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ ఈ ఏడాది సెప్టంబరులో 27 ఏళ్ల యువతిని పెళ్లాడాడు. అయితే అతనికి బట్టతల వుందని పెళ్లయ్యాక తెలిసింది.
 
ఈ విషయాన్ని అత్త మామల దగ్గర చర్చించింది. అనంతరం నేరుగా నయానగర్ పోలీసు స్టేషన్లో అత్తమామలు తన భర్తపై చీటింగ్ కేసు పెట్టింది. అంతేకాకుండా తనను వరకట్న వేధింపులకు గరిచేస్తున్నారని తెలిపింది. బాధితురాలు ఫిర్యాదుతో ఆమె భర్తపై పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అత్తమామలకు బెయిల్ లభించగా ఆమె భర్త పిటిషన్‌ను మాత్రం కోర్టు కొట్టి వేసిందని పోలీసులు తెలిపారు. ఇంకా రెండు రోజుల్లో అతడిని అరెస్ట్ చేస్తామని లిపారు.