శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (13:49 IST)

విశాఖలో ఘోరం.. భార్యపై అనుమానం.. యాసిడ్ పోసి దాడి

విశాఖలో ఘోరం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త భార్యపై యాసిడ్ పోసి దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లిని కాపాడడానికి వెళ్లిన కుమార్తె కూడా గాయపడింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖలోని శివాజీ పాలెంలో ఈశ్వర రావు అనే వ్యక్తి పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య దేవి, కుమార్తె గాయత్రి ఉన్నారు. మద్యానికి బానిసైన ఈశ్వర్ రావుకు భార్యపై అనుమానం. ఆ అనుమానమే భార్యపై యాసిడ్ పోసేదాకా వెళ్ళింది. 
 
భార్య ఇతరులతో చనువుగా ఉంటుందన్న అనుమానంతో నిత్యం తరచూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో బాత్ రూమ్ క్లీనింగ్‌కు ఉపయోగించే యాసిడ్ పోయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ దాడిలో గాయపడిన దేవిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.