సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:49 IST)

ప్రియుడి కోసం భర్తను చంపేసింది.. బాయ్‌ఫ్రెండ్ బెడ్రూమ్‌లోనే..?

ప్రియుడి కోసం భర్తను కడతేర్చింది ఓ మహిళ. ప్రియుడితో సుఖం కోసం ఓ మహిళ ఏకంగా భర్తను హతమార్చి... బాయ్‌ఫ్రెండ్ బెడ్రూమ్‌లోనే శవాన్ని పూడ్చిపెట్టింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా బొంగావ్ గ్రామానికి చెందిన రామకృష్ణ సర్కారు(42), స్వప్న(38)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
అయితే స్వప్న స్థానికంగా ఉండే సుజిత్ దాస్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే తమ అక్రమ సంబంధానికి భర్త రామకృష్ణ అడ్డు వస్తున్నాడని భావించింది. దీంతో అతడిని హతమార్చాలని ప్రియుడు సుజిత్ దాస్‌తో కలిసి స్కెచ్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామకృష్ణను కత్తితో పొడిచింది. ఆపై మృతదేహాన్ని ప్రియుడు సుజిత్ దాస్ బెడ్రూంకు తరలించింది. అక్కడ గుంత తీసి భర్త శవాన్ని పూడ్చి పెట్టింది. 
 
తన ఇంట్లో పూడ్చి పెడితే ఎవరైనా గుర్తు పెట్టే అవకాశం ఉందని.. అదే ప్రియుడి బెడ్రూంలో పూడ్చి పెడితే ఎవరికీ ఈ విషయం తెలియదని భావించింది. నిందితుడి ఇంటి ముందు రక్తపు మరకలు ఉన్న విషయం తెలియరావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో స్వప్న నిందితురాలని తేలింది. దీంతో ఆమెతో పాటు ఆమకు సహకరించిన సుజిత్ దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.