సంబంధిత వార్తలు
- కూతురిని హీరోయిన్ చేయాలనుకుంది.. ఏం చేసిందో తెలుసా?
- భర్త తుదిశ్వాస విడిచిన నాలుగు గంటల్లో భార్య మృతి
- వాట్సాప్ మిస్డ్ కాల్ డిపీ చూసి 45 ఏళ్ల వివాహిత ప్రేమలో 25 ఏళ్ల యువకుడు, ఆ తర్వాత?
- ఇద్దరు బిడ్డలు వైద్యులు.. కానీ భర్త శవానికి ఇంట్లోనే భార్య అంత్యక్రియలు
- పోలీస్ ఆఫీసర్‌ను చితకబాదిన సీఎస్కే మహిళా అభిమాని.. కారణం? (video)
బైకుపై ఎక్కించుకుని మహిళపై ఇద్దరి సామూహిక అత్యాచారం
బస్సు కోసం వేచి వున్న మహిళను బైకుపై తీసుకెళ్లిన ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జుక్కల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో బస్సుకోసం మహిళ నిరీక్షిస్తోంది.
మహిళకు చెందిన యువకుడు బైకుపై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ బైకుపై మరో యువకుడు కూడా వున్నాడు. బైకుపై గ్రామానికి తీసుకెళ్తామని మహిళను నమ్మించాడు. ఆ యువకుడు తన గ్రామానికి చెందిన వాడే కావడంతో నమ్మి బైకు ఎక్కింది.
గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మానుష్య ప్రాంతంలో మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
