సంబంధిత వార్తలు
- ఇంట్లో చొరబడి వెనక నుంచి మహిళను హత్తుకున్న కామాంధుడు... చితక్కొట్టారు
- కన్న కొడుకుని సిమెంట్ బిళ్లతో తల పగులగొట్టి హత్య చేసిన తండ్రి
- కట్టుకున్న భార్యను కొట్టి దుస్తులిప్పి నగ్నంగా రోడ్డుపైకి నెట్టాడు...
- లక్ష మంది అసదుద్దీన్ లు వచ్చినా ఏమీ చేయలేరు: కిషన్ రెడ్డి
- పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం..
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న అలంకార వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 3న ఎదుర్కోలు, 4న తిరుకల్యాణం, 5న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, 7న అష్టోత్తర శత ఘటాభిషేకం జరగనుంది.
ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నారు. అటు.. మార్చి 2 నుంచి 7 వరకు యాదాద్రిలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.