మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (11:35 IST)

కట్టుకున్న భార్యను కొట్టి దుస్తులిప్పి నగ్నంగా రోడ్డుపైకి నెట్టాడు...

కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఇంట్లో తీవ్రంగా కొట్టి దుస్తులు తీసేసి బయటకు నెట్టేశాడు ఓ పైశాచిక భర్త. శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండానే ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది ఆ మహిళ. 
 
మహిళ బట్టలు లేకుండా నగ్నంగా వెళ్ళడం చూసిన స్థానికులు ఆమెకు బట్టలు ఇచ్చి ఏం జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. తనను రోజూ భర్త చిత్రహింసలు పెడుతున్నాడని వారి ముందు కంటతడి పెట్టింది మహిళ. అయితే బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పింది కానీ కంప్లైట్ ఇవ్వలేదని బిక్కనుర్ పోలీసులు చెబుతున్నారు. 
 
ఫిర్యాదు చేస్తే భర్త పైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.