సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (17:52 IST)

భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?

Rowan Baxter
ఆస్ట్రేలియాలో మాజీ రగ్బీ ఆటగాడు తన ముగ్గురు పిల్లలను హతమార్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన రగ్బీ ఆటగాడు రోవాన్ ఛార్లెస్ (43).. కొన్నేళ్ల క్రితం రగ్భీ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆపై ఆస్ట్రేలియాకు చెందిన హన్నా అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 
 
ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగారు. కానీ విబేధాల కారణంగా గత ఏడాది రోవాన్-హన్నా దంపతులు విడిపోయారు. ఆపై రోవాన్ ఒంటరిగా గడుపుతున్నాడు. తన పిల్లలు భార్య హన్నాతో వున్నారు. ఈ నేపథ్యంలో హన్నా తన కారులో ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్తున్న సందర్భంగా.. కారును అడ్డుకుని.. భార్యతో మాట్లాడాలని చెప్పాడు. 
 
ఇలా ఆమె కారెక్కిన రోవాన్ ఆమెతో జగడానికి దిగాడు. దీంతో కారు నుంచి దిగాలని భార్య హెచ్చరించింది. కానీ నుంచి కిందకు దిగని రోవాన్.. తనతో పాటు తీసుకొచ్చిన పెట్రోలును భార్యాబిడ్డలపై పోశాడు. ఏం జరుగుతుందో తెలియక తేరుకునే లోపే.. రోవాన్ నిప్పంటించాడు. ఈ ఘటనలో హన్నా, పిల్లలు అగ్నికి కాలిపోయారు. అటుపిమ్మట రోవాన్ కూడా తనను కత్తితో పొడుచుకున్నాడు. 
 
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని హన్నాను మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగారు. ముగ్గురు పిల్లలు అగ్నికి బలైపోయారు. రోవాన్ కూడా మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.