సంబంధిత వార్తలు
- అమ్మతోడు.. మా ఇంట్లో దొరికింది 12 లక్షలేనంటున్న శేఖర్ రెడ్డి...
- పార్లమెంట్‌లోకి కత్తితో దూసుకెళ్లిన వ్యక్తి....
- లైంగిక వేధింపులు: బస్సులు, రైళ్ళలో అసభ్యంగా వేధించే వాళ్ళను పట్టిచ్చే పరికరం రెడీ....
- వరుసకు అన్నా చెల్లెళ్లు... ప్రేమలో పడి పారిపోయినందుకు కాళ్లతో తన్నిన పెద్దలు..
- అత్యాచారం చేసి యువతిని పూడ్చేశాడు.. రెండుగంటల తరువాత బతికొచ్చిన యువతి..ఎలా..?
టెక్నాలజీతో మోసం చేస్తూ... అడ్డంగా బుక్కైన మాయలేడి...
టెక్నాలజీ సహాయంతో మోసం చేస్తూ.. డబ్బులు వసూలు చేస్తుంది ఓ యువతి. ఇంతకీ ఏం చేస్తుందంటే... పలు పాఠశాలలకి చెందిన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ నుండి స్కూల్ ఫొటోలను డౌన్లోడ్ చేసి మార్ఫింగ్‌లకు పాల్పడి బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఆ ఫోటోలను తిరిగి బాధిత స్కూల్స్‌కి పంపిస్తుంది ఆ కిలాడి లేడి.
తాను సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్నట్టు నమ్మించి ఈ ఫోటోలు తీసేస్తానని చెప్పి బాధితుల నుండి డబ్బు వసూలు చేస్తుందట. ఈ మాయలేడీ బాగోతం బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. హైదరాబాదులో నాలుగు పాఠశాలలకి చెందిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
నిందితురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితురాలు సెల్ ఫోన్లో 225కు పైగా స్కూల్స్ గ్రూపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉన్నత చదువు చదువుకున్నప్పటికీ ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడి ఈ తరహా నేరానికి పాల్పడుతోంది.
తర్వాతి కథనం
