గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2019 (14:02 IST)

వరుసకు అన్నా చెల్లెళ్లు... ప్రేమలో పడి పారిపోయినందుకు కాళ్లతో తన్నిన పెద్దలు..

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం, కే.పి.దొడ్డి గ్రామంలో వరసకు అన్నాచెల్లెల్లు అయిన సాయి(19), వన్నూరమ్మ(15) ప్రేమించుకున్నారు. వీరిద్దరు పెద్దలకు తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే  పెద్దలు వారి ఆచూకి తెలుసుకుని పట్టుకుని కే.పి.దొడ్డి గ్రామంలో పెద్దమనుషుల ఎదుట పంచాయితీ నిర్వహించారు. 
 
వరుసకు అన్నా చెల్లెలు అయినందున గ్రామ ప్రజలు పెద్దలు పంచాయతీ నిర్వహించి అన్నాచెల్లెలు ప్రేమించుకోవడం తప్పు, పైగా మీరు మైనర్లు అని, మన సంప్రదాయానికి విరుద్ధం అని తీర్పు చెప్పారు. అక్కడి దాకా బాగానే ఉంది. ఆ తర్వాతే అది అమానవీయంగా తయారైంది. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప పంచ ఎగ్గట్టుకుని రెచ్చిపోయాడు. 
 
లింగప్ప అమ్మాయిని, అబ్బాయిని చితకబాదాడు. కర్ర దెబ్బలు, కాలి దెబ్బలతో విచక్షణారహితంగా కొడుతూ బహిరంగ శిక్ష వేశారు. అక్కడున్న వారు వీడియో తీయడంతో అది బయటకు వచ్చి వైరల్ అయింది. ఈ దారుణ ఘటన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు.