సంబంధిత వార్తలు
- రాఖీ సావంత్ని వదలని వివాదాలు.. లైన్లోకి దీపక్.. మరి భర్త సంగతేంటి?
- అర్జునుడితో శ్రీకృష్ణుడు రాఖీ గురించి? (Video)
- ప్రైవేట్ గదిలో పెళ్లి చేసుకున్నా... హనీమూన్ తర్వాత వెళ్లిపోయాడు...
- అవును.. పెళ్లి చేసుకున్నా.. 2020 కల్లా తల్లి కావాలనేది నా కోరిక?
- ఉన్నావ్ రేప్ కేసు: 'ఒక్కొక్కరినీ చంపుకుంటూ వస్తామన్నారు'
సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలి..?
శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేయాలి. ఆ తర్వాత రక్షారేకును పూజించాలి. అనంతరం సోదరి తన అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో వారికి రాఖీ కట్టాలని పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత నోరు తీపి చేయడం సంప్రదాయం.
మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటాయి. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం సంప్రదాయం.
పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.
