గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (14:24 IST)

అవును.. పెళ్లి చేసుకున్నా.. 2020 కల్లా తల్లి కావాలనేది నా కోరిక?

వివాదాస్పద నటి రాఖీ సావంత్ బాంబు పేల్చింది. తాను యూకే ఎన్నారై బిజినెస్‌మేన్‌ రితీశ్‌ను వివాహం చేసుకున్నానని చెప్పింది. అతను తన వీరాభిమాని కావడంతో ఆయనను పెళ్లాడానని.. 2020కల్లా తల్లి కావాలనేది తన కోరిక అంటూ చెప్పింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది. పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని రాఖీ చెప్పుకొచ్చింది. 
 
వీసా కోసం తాను ఎదురుచూస్తున్నానని.. రితీశ్ తాను మంచి స్నేహితులమని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తనను చూసిన అతను.. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడని, ఏడాదిన్నర నుంచి ప్రేమలో వున్నామని తెలిపింది. ఇంతమంది స్నేహితుడిని భర్తగా ఇచ్చినందుకు దేవుడికి రాఖీ సావంత్ థ్యాంక్స్ చెప్పింది. పెళ్లైందని సినిమాలకు స్వస్తి చెప్పనని, సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేసింది.