అమెరికా అమ్మాయితో బాహుబలి బలి?
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్. ఈ ముదురు హీరో వార్తలు కొన్ని సంవత్సరాలుగా హల్చల్ చేస్తున్నాయి.
ముఖ్యంగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "బాహుబలి" చిత్రం తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ, బాహుబలి ప్రాజెక్టు తర్వాత ఆయన "సాహో" వంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కమిట్ అయ్యారు. ఆయన అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని పూర్తి చేయగా, ఇది ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ చిత్రం విడుదల సంగతి ఏమోగానీ, ప్రభాస్ పెళ్ళి వార్త మాత్రం ఒకటి హల్‌చల్ చేసింది. అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నారంటూ ఈ వార్తల సమాచారం. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని టాక్. మరి దీనిపై ప్రభాస్ కుటుంబ సభ్యులు కానీ.. పీఆర్వో టీమ్ కానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.