1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. YS Sharmila Praja Prasthanam Padayatra Starts Today

నల్లగొండ జిల్లా నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం

YS Sharmila
నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది.  పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. 
 
ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు. 
 
మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 4.15 గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్ పల్లి చేరుకుంటారు. 
 
నార్కెట్ పల్లిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు మడ ఎడవెల్లి గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్‌కు చేరుకుని అక్కడ ప్రజలతో మాట్లాడతారు
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా, ఎందుకంటే?