గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (11:23 IST)

సరదాగా బందర్ బీచ్‌కు వెళ్లిన ప్రేమ జంట: ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్

కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటపై దాడి చేసి యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసారు కామాంధులు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మంచిలీపట్నంకు చెందిన ప్రేమికులు ఇద్దరూ సరాదాగా బందరు మండలంలోని పల్లెపాలెం బీచ్ ఒడ్డుకు వెళ్లారు. వీరు ఇద్దరే అటుగా వెళ్లడాన్ని కొందరు తాగుబోతు యువకులు గమనించారు.

 
వారి వెనకే ఫాలో అయ్యారు. కొంతదూరం వెళ్లాక ఇద్దరిపై దాడి చేసి, యువకుడిని చెట్టుకు కట్టేసారు. ఆ తర్వాత యువతిపై ఆ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.