సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (08:51 IST)

అడల్ట్ కంటెంట్ వెబ్‌సిరీస్‌లో రెచ్చిపోయిన బబ్లీ బ్యూటీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త ఫేడౌట్ అయిన హీరోయిన్లు మళ్లీ నిలదొక్కుకునేందుకు అంగాంగ ప్రదర్శనకు మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా లిప్‌లాక్ కిస్సులు, నాభి అందాలు, బికినీలు ధరించేందుకు అమితాసక్తిని చూపుతారు. ఈ కోవలేనే ఉన్న హీరోయిన్ బబ్లీ బ్యూటీ హాన్సిక. సినిమా ఆఫర్స్ తగ్గడంతో నషా ఎక్కించడానికి వెబ్ సిరీస్ బాట పట్టింది. 
 
కొలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఈ బ్యూటీ కొన్నాళ్ల పాటు సందడి చేసింది. కానీ గత రెండేళ్లుగా ఈ భామకు సరైన అవకాశాలు లేవు. దీంతో ఆమె తన తంథాను మార్చుకుంది. సినిమాల పరంగా డిమాండ్ బాగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు హన్సిక వెబ్ సిరీస్ బాట పట్టింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ సీరీస్ చేసింది. 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీరీస్ కి 'నషా' అనే టైటిల్‌ని ఫైనల్ చేసిందట యూనిట్. ముంబై నేపథ్యంలో సాగే ఈ సీరీస్ పది ఎపిసోడ్లుగా టెలికాస్ట్ కానుంది.
 
ఈ నషా సిరీస్‌ కాస్త అడల్ట్ కంటెంట్‌ని బేస్ చేసుకునే సాగుతుందని ఇన్ సైడ్ టాక్. హన్సిక ఈ సిరీస్‌లో లిప్ లాక్స్, స్కిన్ షోకు వెనకాడకుండా ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందట. భవిష్యత్ మొత్తం వెబ్ సీరిస్‌లదే అని గ్రహించిన హన్సిక ఈ నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే 'నషా' షూటింగ్ 90 శాతం కంప్లీట్ అయిందని, కేవలం కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమచారం.