బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 నవంబరు 2020 (16:01 IST)

నాకు తెలుగు భాష వచ్చు, కానీ మీ భాష రాదు నాగబాబు గారూ: #justasking అంటూ ప్రకాష్ రాజ్

పవన్ కళ్యాణ్ పైన ప్రకాష్ రాజ్ చేసిన ఊసరవెల్లి కామెంట్లపైన మెగాబ్రదర్ నాగబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు, నువ్వు ఎంతమంది నిర్మాతల్ని హింసించలేదూ, ముందు నువ్వు మారు అంటూ నాగబాబు చేసిన కామెంట్లకు ప్రకాష్ రాజ్ రివర్స్ ఎటాక్ చేసారు.
 
మీ తమ్ముడు మీద వున్న ప్రేమ నాకర్థమయ్యింది, కానీ నాకు దేశం మీద వున్న ప్రేమను అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చి కనీ మీ భాష నాకు రాదు అంటూ #justasking అని కౌంటర్ వేసారు.