గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (12:32 IST)

పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తాం : బండి సంజయ్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. డిసెంబరు ఒకటో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, చివరి రోజు ప్రచారంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ నగరానికి వచ్చి బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, పాతబస్తీలోని హిందువులంతా ఏమైపోయారని ప్రశ్నించారు. ముఖ్యంగా, శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారని ప్రశ్నించారు. హిందువుల ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారన్నారు. ఎవరు కబ్జా చేశారని ఘాటుగా సూటిగా ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, హైదరాబాద్ నగర పోలీసులను హీరోలతో పోల్చారు. భాగ్యనగర్‌లో బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని, పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లను, రోహింగ్యా లుచ్ఛాలను బయటకు గుంజి తరిమేస్తామని వ్యాఖ్యానించారు. భాగ్యనగరికి బీజేపీయే రక్షణ కవచమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.