జబర్దస్త్ కొత్త లవర్స్.. ఇమ్మూను వర్ష మోసం చేసిందా? కార్తీక్‌తో రొమాన్స్?!
సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్‌లా ప్రస్తుతం జబర్దస్త్ స్టేజిపై కొత్త జంట సందడి చేస్తోంది. వారే ఇమ్యాన్యుయేల్-వర్ష. వీరిద్దరి ఒకే టీమ్‌లో పనిచేయడం, అందులోనూ లవర్స్‌గా నటిస్తుండడంతో.. జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. మీ జంట కేక అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాదు ఇమ్మూ చాలా మంచి వ్యక్తి అని.. తన బెస్ట్ ఫ్రెండ్ అని పలు సందర్భాల్లో చెప్పింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు జబర్దస్త్ నిర్వాహకులు కూడా.. వీరిద్దరి చుట్టూనే స్కిట్‌ను నడిపిస్తోంది. ఐతే వచ్చే శుక్రవారానికి సంబంధించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల అయ్యింది. అందులోనూ ఇమ్మూ, వర్షాల సందడే హైలైట్‌గా నిలిచింది.
ఎప్పటిలాగే ఇమ్మూన్యుయేల్‌పై ప్రేమను కురిపించింది వర్ష. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీస్తే నా గుండెల్లో నీ ఫొటో వచ్చిందని చెప్పడంతో.. జడ్జిలు పగలబడి నవ్వుతారు. ఐతే అంతలోనే ప్లేట్ ఫిరాయించింది వర్ష. ఇమ్మాన్యుయేల్ కళ్ల ముందే కార్తీక్‌కు పెళ్లి చేసుకుంది.
ఇమ్మూ చూస్తున్న సమయంలో.. కావాలని మరీ కార్తీక్‌తో రొమాన్స్ చేసింది వర్ష. ఈ ప్రోమోపై నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. ఇమ్మూను వర్ష దారుణంగా మోసం చేసిందని సరదాగా అభిప్రాయడుతున్నారు.
మరి ఇమ్మూను వర్ష ఎందుకు మోసం చేసిందో తెలియాలంటే వచ్చే వారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ దాక వేచి చూడక తప్పదు.