శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (15:30 IST)

జబర్దస్త్‌లో కొత్త లవ్ ట్రాక్.. కలర్‌లో ఏముంది మేడమ్.. మనసు మంచిది..? (video)

Varsha_Emmanuel
బుల్లితెర ప్రేమ జంటల జాబితాలో కొత్త జంట చేరింది. ఇంకా జబర్దస్త్ షోలో ట్రాకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ట్రాకులతో రష్మీ సుధీర్ జంట బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఆ రేంజ్‌లో ఏ ట్రాక్ కూడా వర్కవుట్ కాలేదు. ఆది అనసూయలు బాగానే ట్రై చేశారు. కానీ అది కేవలం స్కిట్ వరకు మాత్రమే అని అందరికీ అర్థమయ్యేది. కానీ ఈ మధ్య ఓ కొత్త జంట రచ్చ చేయడం ప్రారంభించారు. ఇమ్మాన్యుయల్ వర్ష ట్రాక్ బాగా క్లిక్ అయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటూ జనాల్లో బాగా గుర్తింపు లభించింది.
 
ఈ ట్రాకును ఉపయోగించి చేస్తున్న స్కిట్లు బాగానే క్లిక్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కథను బయట పెట్టేశారు. ఏకంగా రోజా అడిగే సరికి వ్యవహారం బయటకు వచ్చింది. ఏదైనా ఉందా? అని వర్ష, ఇమ్మాన్యుయల్‌ను అడిగేసింది. స్కిట్ వరకు ఇలా మేడం అంటూ వర్ష చెప్పుకుంటూ వచ్చింది.. అదే సమయంలో ఇమ్మాన్యుయల్ మరో సెటైర్ వేశాడు.. బయట వేరే ఉంటది మేడం అనడంతో వర్ష సిగ్గు పడింది.
 
నాకు ఏదో డౌట్ కొడుతోందని రోజా గుచ్చి గుచ్చి అడగడంతో అసలు విషయం చెప్పింది వర్ష. ఇమ్మాన్యుయల్ మంచి వాడని, తనకు బాగా గౌరవం ఇస్తాడని చెప్పుకొచ్చింది. రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశానంటూ వర్ష ఏదో చెప్పబోయింది. బ్లాక్ అండ్ వైట్ అంటూ రోజా కామెంట్ చేయగా.. అందం ఏముంది మేడం.. మనసు మంచిది.. ఇమ్మాన్యుయల్ చాలా మంచివాడని చేయి పట్టుకుంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈ కొత్త జంట పెళ్లి పీటలు ఎక్కేలానే ఉంది.