గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (13:34 IST)

ఆ హీరోయిన్ పరిస్థితి అంతలా దిగజారిపోయింది.. విలన్‌కు భార్యగా...

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం మజ్ను. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి అను ఎమ్మాన్యుయేల్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం డిజాస్టర్ ఫెయిల్యూర్‌ను సొంతం చేసుకుంది. 
 
ఆ తర్వాత అను నటించిన మరో చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. అల్లు అర్జున్ హీరో. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అను ఎమ్మాన్యుయేల్‌పై చెడు ముద్రపడింది. ఐరెన్ లెగ్ అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ పరిస్థితుల్లో "గీత గోవిందం" చిత్రంలో క్యామియో రోల్ పోషించింది. ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడుకు సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 
 
ఇపుడు ఓ విలన్ భార్యగా నటించేందుకు ఛాన్స్ రాగా, ఆ పాత్రను పోషించేందుకు ఈ అమ్మడు సమ్మతించినట్టు సమాచారం. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబోలో అల్లుడు అదుర్స్ అనే చిత్రం తెరకెక్కుతోంది. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. న‌భా న‌టేష్ హీరోయిన్. 
 
కుటుంబ విలువలకు వినోదాన్ని జోడిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ప్రకాష్‌రాజ్‌, వెన్నెలకిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న‌కి భార్య‌గా అను ఎమ్మాన్యుయేల్ న‌టిస్తుంద‌ని తాజా స‌మాచారం . ఇందులో నిజ‌మెంత ఉంద‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.