మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (19:07 IST)

వరలక్ష్మికి మళ్లీ విలన్ గెటప్.. మాస్ మహారాజాతో పోటీ పడుతుందా?

దర్శకుడు గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న సినిమాలో నటుడు రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నెగటివ్ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మికి సంబంధించిన పోర్షన్‌ను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు ఆమె పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశాడట. ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని టాక్. 
 
ఈ సినిమా తరువాత ఈ తరహా పాత్రలతో ఆమె తెలుగులోను బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తమిళనాట విలనిజానికి పెట్టింది పేరుగా వరలక్ష్మిని తమ సినిమాలలో తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. వరలక్ష్మి ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆపై విలన్ పాత్రల్లో కనిపించింది. 
 
వరలక్ష్మి తాజాగా ‘వెల్వెట్ నగరం’ అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.