బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:27 IST)

ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరేనా? క్రాక్ టీజర్

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం క్రాక్. బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మే ఎనిమిదో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అంటే మహాశివరాత్రిని పురస్కరించుకుని రిలీజ్ చేశారు. 
 
రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాత. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'క్రాక్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. పైగా, ఒంగోలు జిల్లాలో ఉన్న క్వారీల తవ్వకాలు, వాటి వెనుక జరుగుతున్న చీకటి కోణాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు.