గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (14:30 IST)

''విలన్''గా కనిపించనున్న అదితిరావు హైదరి

అదితిరావు హైదరి త్వరలోనే ప్రతినాయకురాలిగా కనిపించబోతున్నారట. అదితి ప్రస్తుతం 'తుగ్లక్‌ దర్బార్‌', 'ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌', 'హే సినామిక', 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రాల్లోనూ నటిస్తోంది. తన గ్లామర్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన అతిదిరావు.. ప్రస్తుతం విలన్‌గా కనిపించనుండటం హాట్ టాపిక్‌గా మారింది. 
 
అమాయకత్వంతో కూడిన అందానికి కేరాఫ్‌గా నిలిచే అదితి విలన్‌గా నటించిందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు నటించిన మల్టిస్టారర్‌ సినిమా 'వి'. ఈ చిత్రంలో మిస్టరీ కిల్లర్‌గా నాని, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సుధీర్‌బాబు నటించారు. ఇందులో పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కకుండా మర్డర్స్‌ చేసే మిస్టరీ కిల్లర్‌ నానికి సహాయకారిగా అదితి కనిపించనుందట. 
 
నాని, అదితి కలిసి పోలీసులకు విసిరే సవాలే 'వి' చిత్రమట. ఈ నెలలోనే విడుదల కావాల్సిన ఈచిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో అదితి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.