గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (18:25 IST)

బిగ్ బాస్‌తో మోనాల్‌కు లింకుంది.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

Monal Gajjar
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన కరాటే కళ్యాణి ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసేసింది. ఇప్పుడు ఏకంగా మోనాల్ గజ్జర్‌కు బిగ్ బాస్‌కు లింకుందని చెప్తోంది. ఇంకా షో నుంచి ఎలిమినేట్ అయిన దేవి, సుజాత, తనకు వచ్చిన ఓటింగ్ విషయంలో ఆమె పలు సందేహాలు వ్యక్తం చేసింది. తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో చెపితే బాగుండేదని ఆమె చెప్పింది.
 
ఇక దేవికి ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేశారని.. మెహబూబ్‌కు బదులుగా తనకు అన్యాయం జరిగిందని ఆమె చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో ఎలిమినేట్ అయిన సుజాత, కల్యాణి కలిసి పాల్గొన్నారు. హౌస్‌లో ఎవరు అయితే స్కిన్ షో చేయట్లేదో వారు మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారని.. స్కిన్ షో చేసే వాళ్లు హౌస్‌లో ఉంటున్నారని బాంబు పేల్చింది. తాను, సుజాత స్కిన్ షో చేయకపోవడం వల్లే ఎలిమినేషన్ చేశారని ఫైర్ అయ్యింది.
 
మోనాల్ లాంటి వాళ్లు విప్పి చూపిస్తారని. వాళ్లు గ్లామర్ షో చేస్తారని.. అందుకే వాళ్లను ఎలిమినేట్ చేయరని కళ్యాణి పెద్ద బాంబే పేల్చింది. ఇక నిజంగా షోలో కూడా మోనాల్ మామూలు గ్లామర్ షో చేయట్లేదు. పైగా ఆమె ముక్కోణపు ప్రేమ కథ నేపథ్యం కూడా ఆమెకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.
 
మరోవైపు బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐదువారాలను బిగ్ బాస్-4 షో పూర్తి చేసుకుంది. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. ఎవరికీవారు బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు కొనసాగేందుకు మిగతా వారిని టార్గెట్ చేస్తుండటంతో గేమ్ ఉత్కంఠగా సాగుతోంది.
  
ఐదోవారం ఎలిమినేషన్ గురించి కరాటే కల్యాణి మాట్లాడుతూ తాను ముందే ఊహించానని చెప్పింది. మోనాల్.. అమ్మ రాజశేఖర్.. సుజాతలలో ఎవరో ఒకరు వెళ్తారని అనుకున్నానని చెప్పింది. వీరిలో మోనాల్ కచ్చితంగా వెళ్లదని.. ఎందుకంటే ఆమె వీకెండ్‌లో కాస్త గ్లామర్ షో చేస్తూ అన్ని కనబడేలా బట్టలు వేసుకుందని చెప్పింది. మేం అలా చేయలేం కాబట్టి మమ్మల్ని బయటకు పంపిచేస్తారు అంటూ హాట్ కామెంట్ చేసింది.
 
ఇక 'బిగ్ బాస్'తో వాళ్లకు వాళ్లకు ఏదో లింకులు ఉంటాయి కదా అంటూ మోనాల్‌పై కల్యాణి పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మెహబూబ్‌ను కావాలనే సేవ్ చేసినట్టు ఉందని కల్యాణి చెప్పింది. ఇప్పటివరకు ఏ కెప్టెన్‌కు లేని అధికారాన్ని సోహెల్‌కు ఎలా ఇస్తారని ప్రశ్శించింది. ఇక టైటిల్ విన్నర్‌ను కూడా మెహబూబ్‌కే ఇచ్చేయండి అంటూ ఎలిమినేషన్ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బిగ్ బాస్-4లో ఎలిమినేషన్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.