1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Trisha opens up about her marriage plans

పెళ్లి అంటే ఒక బాధ్యత.. అది నా వల్ల కాదు.. త్రిష

Trisha
స్టార్ హీరోయిన్, చెన్నై చంద్రం త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ... తాను అనేక మందితో రిలేషన్‌లో వున్నానని.. కానీ ఇప్పటివరకు ఏది వర్కౌట్ కాలేదని బాంబు పేల్చింది. రకరకాల మనస్తత్వాలు వున్న వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా వుండదని, పెళ్లి అంటే ఒక బాధ్యత. అది తన వల్ల కాదని త్రిష చెప్పుకొచ్చింది. 
 
కానీ ఇప్పుడున్న వయస్సులో కచ్చితంగా సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం. ఒకరి కోసం జీవించడం కంటే మన కోసం మనం జీవించినప్పుడే జీవితానికి అర్థం వుంటుందని తెలిపింది. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే త్రిష పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా వుండిపోతుందా అనే అనుమానం కలుగక మానదు. 
 
అగ్రహీరోలతో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్న త్రిష.. కొద్దికాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. పొన్నియన్ సెల్వన్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జగన్‌తో పవన్ నాలుగో పెళ్లి.. ఫోటోలు వైరల్