1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (11:26 IST)

కల్కి 2898ADతో ప్రభాస్ తన బాక్సాఫీస్ సామర్థ్యాన్ని చేరుకుంటాడా?

kalki-prabhas
kalki-prabhas
బాహుబలి సినిమా రెండుభాగాలు తర్వాత ప్రభాస్ అంతరేంజ్ లో హిట్ లేకపోయింది. కొన్ని కథలు ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. ఆ తర్వాత రాముడు అవతారంతో  తీసిన ఆదిపురుష్ కూడా డిజాస్టర్ అయింది. రాజమౌళి సినిమాతో ఆల్-టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత ప్రభాస్ అనేక ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు, ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగా పని చేయలేదు.
 
అయితే సలార్ సినిమా కాస్త ఊరట నిచ్చింది. అయితే ఆ సినిమాకూ బాలీవుడ్ లో మరో సినిమాకు మధ్య పోటీ ఏర్పడింది. సాలార్ బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది కానీ డుంకీ సినిమాతో పోటీ కారణంగా సాలార్ మంచి బాక్సాఫీస్ వసూళ్ళను కోల్పోయింది కాబట్టి ఇది ప్రభాస్ రేంజ్ కలెక్షన్స్ కాదు అనిట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక ఇప్పుడు నాఘ్ అశ్విన్ తీస్తున్న హాలీవుడ్ స్టయిల్ సినిమా కల్కీ 2898ADతో ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ & భారతదేశపు అత్యంత భారీ బడ్జెట్ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమా ఎలా వుండబోతోందనేది ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత నెలకొంది. అయితే ఇందులో అమితాబ్, కమల్ తోపాటు పలువురు నటులు కూడా వుండడంతో ఈ సినిమా మరో ట్రెండ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.