బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (12:46 IST)

తన పుట్టినరోజున ఏమండో బాగున్నారా అంటున్న శ్రీవిష్ణు !

birthday cake srivishnu
birthday cake srivishnu
శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రత్యేకమైన శైలి. పక్కింటి కుర్రాడిగా పలు కథలతో వెండితెరపైకి వచ్చాడు. అల్లూరి, భలా తందానా, అర్జున ఫాల్గుణ చిత్రాలు నటించినా సామజవరగమన సినిమా ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా కెరీర్ గ్రాప్ ను పైకి లేపింది. విశేషం ఏమంటే ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 29 . లీప్ సంవత్సరం కనుక ప్రతి ఏడాది జరుపుకోవడానికి కుదరదు. గత రాత్రి ఆయన తనసన్నిహితులతో పుట్టినరోజును జరుపుకుని కేక్ ను కట్ చేశారు.
 
birthday cake srivishnu
birthday cake srivishnu
ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. ఒకరకంగా ఆయన తాజా సినిమా ఓం భీమ్ బుష్ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అదికాకుండా అంతకుముందే షూట్ జరిగిన సినిమా తర్వాత విడుదల కాబోతుంది. దీనికి ఏమండోయ్ బాగున్నారా.. అంటూ ఆకట్టుకునే టైటిల్ ను పెట్టారు. దీని వివరాలు త్వరలో తెలియనున్నాయి.