సంబంధిత వార్తలు
- జియో ఫైబర్ కస్టమర్లకు కాంప్లిమెంటరీ గిఫ్ట్.. గోల్డ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు..
- ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం.. కానీ ఐయూసీ ఛార్జీలుంటాయ్
- పెళ్లిపై సీరియస్‌గా ఆలోచన చేస్తున్న 'చందమామ' (video)
- హీరో సూర్య ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..?
- బాలయ్య - జూనీయర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్..!
దిల్ రాజుని రంగంలోకి దింపిన అల్లు అరవింద్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఆహో అంటూ ఓటీటీ ఫ్లాట్ఫామ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. దీనిని సక్సెస్ చేయడం కోసం అల్లు అరవింద్ సక్సస్‌ఫుల్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దించారు. వంశీ పైడిపల్లి, క్రిష్, అనిల్ రావిపూడి.. ఇలా కొంతమంది దర్శకులు ఆహా కోసం వర్క్ చేస్తున్నారు. ఇటీవల మిల్కీబ్యూటీ తమన్నాతో ఓ షో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా ఆహా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... అల్లు అరవింద్ దిల్ రాజుని రంగంలోకి దింపారట. ఆహా కోసం మంచి కంటెంట్ సెలెక్ట్ చేసే బాధ్యతను దిల్ రాజుకి అప్పగించారని సమాచారం.
అంతేకాకుండా.. ఓ వైపు ఆహా కోసం కంటెంట్ సెలెక్షన్ చేస్తూనే మరోవైపు ఆహా కోసం తను కూడా వెబ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలిసింది. ఆల్రెడీ కొన్ని స్టోరీలు విని ఓకే చేసినట్టు టాక్.
ఎంతమంది దర్శకులను పెట్టుకున్నప్పటికీ.. ఆహాకి ఆశించిన స్ధాయిలో స్పందన రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది. దీంతో దిల్ రాజుని రంగంలోకి దింపితే వర్కవుట్ అవుతుందనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ ఇలా ప్లాన్ చేసారు. మరి.. ఈసారైనా అల్లు అరవింద్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
తర్వాతి కథనం
