సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (19:46 IST)

చందమామకు పోటీగా నడుము సుందరి.. గ్లామర్ రోల్స్‌కు ఇలియానా రెఢీ!

చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వివాహంపై దృష్టి పెట్టింది. ఆఫర్లు వస్తున్నా.. వివాహం చేసుకోవాలని భావిస్తోంది. అయితే అనూహ్యంగా నడుము సుందరి ఇలియానా కాజల్ అగర్వాల్‌కి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎందుకంటే ఇలియానా ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధమని ప్రకటించింది. దాంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఇలియానాను సంప్రదించడం మొదలు పెట్టారట. 
 
గ్లామర్ విషయంలో కాజల్ అడ్డు చెప్పినా.. ఇలియానా ఏమాత్రం అడ్డు చెప్పదు. దీన్నే ప్రస్తుతం దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. పైగా కాజల్ కంటే తక్కువ పారితోషికానికే ఇలియానా రెడీ అంటోంది. ప్రస్తుతం ఇలియానాకు ఎక్కువ అవకాశాలు లేవు.. అలా అని ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటికి మొన్న నితిన్- మేర్లపాక గాంధీల 'అందాదున్' రీమేక్ కోసం కూడా ఈమెను సంప్రదించారు. 
 
అయితే అందులో విలన్ పాత్రకు అనుకోండి. అయినప్పటికీ యంగ్ హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలియానాతో వర్క్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి చేసుతుంటే కాజల్ అగర్వాల్‌ ఆఫర్లను ఇలియానా ఎగరేసుకుని పోయే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మరి టాలెంట్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఇలియానా పోటీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 
kajal agarwal
 
ఇప్పటికే కెరీర్ ప్రారంభించి 13 ఏళ్ళు అవుతున్నా.. ఇంకా ఇండస్ట్రీలో కాజల్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. మహేష్ బాబు, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో అయితే రెండేసి సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుంది. అలాంటి హీరోయిన్‌కు పోటీ వస్తే.. ఎలా డీల్ చేయాలనే ఐడియా వుండదా అంటున్నారు.. చందమామ ఫ్యాన్స్. ఏం జరుగుతుందో వేచి చూడాలి.